ప్రముఖ పారిశ్రామిక వేత్త నికోలస్‌ సంచలన నిర్ణయం..

10 December 2023

స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త నికోలస్‌ సంచలన నిర్ణయం. తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న సంరక్షకుడిని దత్తత తీసుకునేందుకు సిద్ధం.

రూ.97వేల కోట్ల ఆస్తిని అతని పేరు మీద రాస్తానంటున్న పారిశ్రామిక వేత్త. 1837లో ప్రారంభమైన స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ హెర్మెస్‌.

ఆ కంపెనీ ఐదో తరానికి చెందిన వారసుడు నికోలస్‌ ప్యూచ్‌. 80ఏళ్ల నికోలస్‌కు హెర్మెస్‌ కంపెనీలో 5-6శాతం వాటాలు. ఆస్తుల విలువ దాదాపు రూ.97 వేల కోట్ల రూపాయలు.

నికోలస్‌కు వివాహం కాలేదు. వారసులెవరూ లేకపోవడంతో ఆస్తంతా ఎవరికి దక్కబోతుందనే దానిపై అంతా ఆసక్తి బాగా ఉంది.

తన ఆస్తికి వారసుడి ఎవరన్నా విషయంలో నికోలస్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్విస్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

గత కొన్నేళ్లుగా తన బాగోగులు చూసుకుంటున్న 51 ఏళ్ల వ్యక్తిని దత్తత తీసుకునేందుకు సిద్ధమైన వ్యాపారవేత్త నికోలస్‌.

చట్టప్రకారం దత్తత పూర్తయిన తర్వాత నికోలస్ తన ఆస్తి బాధ్యతలు అతనికి అప్పగించనున్నట్లు సమాచారం అందింది.

తన ఇంట్లో ఉన్న కుటుంబ తగాదాల వల్లే నికోలస్‌కు హెర్మెస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది.