17 February 2024
TV9 Telugu
భారతదేశంలో 200 కంటే ఎక్కువ నదులు ఉన్నాయి. భారత్ నుంచి ప్రవహించే వీటిలో కొన్ని పొరుగు దేశం పాకిస్థాన్‌కు కూడా వెళ్తాయి.
సింధు జల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్ నదులు పాకిస్తాన్‌కు దక్కగా, రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్‌కు దక్కాయి
సింధూ నది టిబెట్ సమీపంలో పుట్టింది. అక్కడి నుంచి కాశ్మీర్ మీదుగా పాకిస్థాన్ చేరుకుంటుంది. ప్రపంచంలోని అతి పొడవైన నదులలో ఒకటి.
జీలం నది సింధూ నదికి ఉపనది. భారతదేశంలోని జమ్మూ, కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా గుండా ప్రవహిస్తుంది. పాకిస్తాన్‌లో చీనాబ్ నదిలో కలుస్తుంది.
జమ్మూ ,కాశ్మీర్ రాష్ట్రం నుంచి ప్రవహిస్తూ పాకిస్తాన్‌లో అడుగుపెడుతుంది. పాక్ లోని పంజాబ్‌లో ఒక ప్రధాన నది. చీనాబ్ సింధు నదికి ఉపనది అయిన సట్లెజ్ నదిలో కలుస్తుంది
రావి నది ఇది సట్లెజ్ నదికి ఉపనది. హిమాలయాలలో ఉద్భవించి హిమాచల్ ప్రదేశ్ నుండి జమ్మూ.. కాశ్మీర్ మీదుగా ప్రవహిస్తుంది. పాకిస్తాన్‌లోని జాంగ్ జిల్లాలో చీనాబ్ నదిని కలుస్తుంది.
సట్లెజ్ నది టిబెట్‌లోని కైలాస్ శ్రేణిలో లోయ వద్ద పుట్టింది. భారత దేశం గుండా వెళ్తూ బియాస్ నదిని కలుపుకొని పాకిస్తాన్‌కి చేరుకుంటుంది. సట్లెజ్ నది సింధు ఉపనదుల్లో కెల్లా పొడవైన ఉపనది
పాకిస్థాన్‌లోని పెద్ద ప్రాంతాలు ఈ నదుల నీటితో సాగునీటిని పొందుతున్నాయి. సింధు నది పాకిస్థాన్‌లో అతి పొడవైన నది దీనిని పాకిస్థాన్‌కు జీవనాడి అంటారు.