ఆ దేశ ప్రధానిగా స్వలింగ సంపర్కుడు!

TV9 Telugu

13 January 2024

ఫ్రాన్స్ దేశం అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఫ్రాన్స్ దేశ ప్రధాన మంత్రిగా తొలిసారి ఓ స్వలింగ సంపర్కుడు 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్‌‌ను ప్రతిపాదించారు.

స్వలింగ సంపర్కుడే కాదు.. అతిపిన్న వయస్కుడైన తొలి ఫ్రాన్స్ ప్రధాని గాబ్రియేల్ అట్టల్‌‌ కానుండటం విశేషం.

సోషలిస్టు పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరిన అట్టల్.. ఫ్రాన్స్ ఆరోగ్య శాఖలో పదేళ్ల కిందట సలహాదారుగా పనిచేశారు.

ప్రస్తుతం మెక్రాన్ సర్కారులో గాబ్రియేల్ అట్టల్‌ విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన్ను ప్రధానిగా నియమించడంపై పలువురు అసంతృప్తి.

గాబ్రియేల్ అట్టల్‌‌ తాను స్వలింగ సంపర్కుడినని బహిరంగంగా అంగీకరించాడు. గాబ్రియేల్ అట్టల్‌‌ ఫ్రెంచ్ రేడియో షోలలో కూడా పనిచేశారు.

అతను ఒక సహజమైన, తెలివైన మంత్రిగా ఫ్రాన్స్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వ మంత్రులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.

గాబ్రియేల్ అట్టల్‌‌ తండ్రి యూదు మూలానికి చెందినవాడు. అతని తల్లి పూర్వీకులు గ్రీకు-రష్యన్‌ దేశానికి చెందినవారు.