TV9 Telugu

ఉద్యోగులకే తన కంపెనీని ఇచ్చేసిన పెద్దాయన!

22 Febraury 2024

ఎక్కడైనా ఎపుడైనా ఒక సంస్థకుగాని లాభాలు వచ్చాయంటే అందులో ఉద్యోగులకు జీతాలు పెంచుతారు లేదా బోనస్ ఇస్తారు.

కానీ అమెరికాలో బాబ్‌ మూర్‌ అనే వ్యక్తి తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు కంపెనీ యాజమాన్య బాధ్యత అప్పగించారు.

"బాబ్స్‌ రెడ్‌ మిల్‌'' అనే చిరుధాన్యాల ఉత్పత్తుల సంస్థను 1978లో నెలకొల్పారు. తన కృషితో కంపెనీని ఉన్నత స్థాయిలో నిలిపారు.

2010లో తన 81 పుట్టినరోజు నాడు 209 మంది ఉద్యోగులకు యాజమాన్య వాటాలను కేటాయించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 700కు చేరింది.

ఒక కంపెనీ ఉద్యోగుల కంటే లాభాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సంప్రదాయాన్ని నివారించడమే తన ఉద్దేశమని బాబ్‌ ఒకానొక సందర్భంలో చెప్పారు.

సంస్థను విక్రయించాలని చాలా మంది అడిగారని తన నిర్ణయం చెబితే అవహేళన చేశారనీ, ఉద్యోగుల పట్ల దయతో మెలగడం ముఖ్యం అన్నారు బాబ్‌.

ఫోర్బ్స్‌ అంచనా ప్రకారం.. 2018 నాటికే కంపెనీ ఆదాయం 100 మిలియన్‌ డాలర్లు. 70 కంటే ఎక్కువ దేశాల్లో 200లకు పైగా ఉత్పత్తులను విక్రయిస్తోంది.

ఇటీవల ఫిబ్రవరి 10న బాబ్‌ మూర్‌ 95 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఉద్యోగులంతా సంతాపం ప్రకటించారు.