సామాన్యురాలిని పెళ్లి చేసుకున్న బిలీనియర్..  

13 January 2024

TV9 Telugu

ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా కుమారుడు అబ్దుల్ మతీన్ సాధారణ అమ్మాయితో వివాహం వార్తల్లో నిలుస్తోంది.

బ్రూనై రాయల్ వెడ్డింగ్

యాంగ్ ములియా అనిషా/అనిషా రోష్నా ఇసా కలేబిక్ అనే యువతిని గురువారం రాత్రి రాజరిక శైలిలో మనువాడాడు. ఈ వేడుక 10 రోజుల పాటు జరగనుంది.

10 రోజుల పాటు వేడుక 

ఇస్తియాదత్ బర్బెడక్ వివాహ ఆచారం గురించి  చర్చ జరుగుతోంది. ప్రజలు దీనిని హిందూ మతంలోని పెళ్లిళ్లలో జరిగే హల్దీ వేడుకని తలపిస్తుంది. 

ఇస్తియాదత్ బర్బెడక్

పసుపుని పూయడం సంతానోత్పత్తి , సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది. బ్రూనై దేశంలోని  అధికారిక మతం సున్నీ ఇస్లాం. 

ఎన్నో ఏళ్ల నాటి ఆచారం

బందర్ సెరి బెగవాన్‌లోని బంగారు గోపురం మసీదులో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. 1,788 గదుల ప్యాలెస్‌లో వివాహ తంతు జరిగింది.

ఇస్లామిక్ సంప్రదాయంలో  

పెళ్లి వేడుకలు ఈ నెల 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పెళ్లి వేడుకలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు హాజరు కానున్నారు

ప్రముఖులు హాజరు

వివాహ వేడుకల్లో చివరి రోజు నవ దంపతులు మతీన్, అనిషా.. ప్రజలు నుండి ఆశీర్వాదం తీసుకునేందుకు వీధుల్లోకి రానున్నారు. 

ప్రజలు నుండి ఆశీర్వాదం