పాక్‌ కొత్త ప్రధాని షాదీ కహానీ.. 60 యేళ్లలో ఏకంగా 5 పెళ్లిళ్లు

March 05, 2024

TV9 Telugu

ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఎలక్షన్లు తీవ్ర ఉత్కంఠకు తెరలేపాయి. కొన్నిరోజుల పొలిటికల్ హై డ్రామా తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటు చేశారు

 గతంలో ఇమ్రాన్ ఖాన్ సర్కార్‌లో ప్రధాని పదవి నుంచి దిగిపోయిన షెబాజ్ షరీఫ్ మళ్లీ ఆ పీఠాన్ని దక్కించుకున్నారు. తాజాగా పాక్‌ 24వ ప్రధానిగా షెబాజాజ్ షరీఫ్‌ బాధ్యతలు చేపట్టారు

ఆయన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కి స్వయానా సోదరుడు (టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్). ఇక షెబాజ్ షరీఫ్ పాకిస్థాన్ రాజకీయ నేతల్లో అత్యంత ధనవంతుల్లో ఒకరు

మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన షెబాజాజ్ షరీఫ్‌ పెళ్లిళ్ల విషయంపై ప్రస్తుతం చర్చనడుస్తుంది. అందుకు కారణం లేకపోలేదు.. తన 60 యేళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది

మొత్తం ఐదు పెళ్లిళ్లు చేసుకున్న పాక్ ప్రధాని షెబాజాజ్ షరీఫ్‌ ప్రస్తుత వయసు 72 ఏళ్లు. అందులో ముగ్గురు భార్యలతో ఇప్పటికే విడాకులు జరగ్గా, మిగిలిన ఇద్దరు భార్యలతో కలిసి ఉంటున్నాడు 

23 ఏళ్ల వయసులోనే 1973లో తల్లిదండ్రుల అనుమతి లేకుండా సుస్రత్ షెహబాజ్‌ని పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. ఆ తర్వాత 1993 లో 43 ఏళ్ల యవసులో మోడల్ అలియా హనీనీ పెళ్లి చేసుకున్నారు

కొంత కాలం తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నిరోజులకే అలియా హనీ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తర్వాత నిలోఫర్ ఖోసాను పెళ్లి చేసుకున్నాడు. ఆ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు

ఏనిమిదేళ్ల పాటు పాకిస్థాని రచయిత్రి, నటి తెహ్మిని దురానీతో రహస్య ప్రేమాయణం నడిపి 2003లో పెళ్లి చేసుకున్నారు. ఇక 2012లో చివరిగా 60వ యేట కుల్సూమ్ హాయి అనే మహిళను రహస్యంగా ఐదో పెళ్లి చేసుకున్నారు