పాకిస్తాన్‌లో హిందూ మహిళ హిస్టరీ క్రియేట్‌..

24 December 2023

TV9 Telugu

పాకిస్థాన్‌లో తొలిసారిగా హిందూ మహిళ మనీషా రూపేటా డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

పాకిస్థాన్‌లోని వెనుకబడిన ప్రాంతం ప్రావిన్స్‌ దగ్గరున్న చిన్న పట్టణం జాకోబా‌బాద్‌కు చెందిన ఒక హిందూ అమ్మాయి మనీషా రూపేటా.

మనీషా 13 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. ఆమె తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో ఉన్నత చదువులు అభ్యసించింది.

సింధ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, 16వ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికైన మనీషా రూపేటా.

మనీషాకు ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు. ముగ్గురు సోదరీమణులు MBBS వైద్యులు, ఆమె తమ్ముడు మెడికల్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడు.

మహిళలపై హింస జరిగే సమాజంలో వారికి రక్షణ కల్పించేందుకు పోలీసు ఉద్యోగం ఎంపిక చేసుకున్న పాక్ హిందూ మనీషా.

బాధ్యతలు స్వీకరించే ముందు.. కరాచీలోని అత్యంత మారుమూల ప్రాంతమైన లియారీలో శిక్షణ పొందిన హిందూ మహిళా మనీషా.

హింస, నేరాలు అధికంగా ఉండే లియారీ ప్రాంతంలో ప్రస్తుతం మనీషా విధులు నిర్వహిస్తున్నారు. మనీషా ఒక ప్రైవేట్ ట్యూషన్ కూడా నడుపుతోంది.