ప్రపంచంలో అవినీతి రహిత దేశాలు ఇవే..

TV9 Telugu

09 February 2024

ప్రపంచంలో అవినీతి రహిత, అత్యంత అవినీతిమయమైన దేశాల జాబితా విడుదలయ్యింది. ఇందులో ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

ఈ జాబితాలో అవినీతి రహిత దేశంగా డెన్మార్క్ అగ్రస్థానంలో నిలవగా.. ఫిన్‌లాండ్, న్యూజిలాండ్ రెండు,మూడు స్థానాల్లో నిలిచాయి

0-100 పాయింట్లలో 90 పాయింట్లతో వరుసగా ఆరో సంవత్సరం ఈ జాబితాలో డెన్మార్క్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

నార్వే, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, నెథర్లాండ్స్, జర్మనీ, లక్సెంబౌర్గ్ దేశాల్లో అవినీతి చాలా తక్కువని ఈ నివేదిక వెల్లడించింది.

180 దేశాలతో ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన ఈ జాబితాలో అత్యంత అవినీతిమయమైన దేశంగా సోమాలియా మిగిలింది.

అత్యంత అవినీతిమయమైన దేశాల జాబితాలో సోమాలియా తర్వాత వెనిజులా, సిరియా, దక్షిణ సూడాన్, యెమెన్‌లు ఉన్నాయి

గతంతో పోలిస్తే భారత్‌లో అవినీతి కాస్త పెరిగినట్లు ఈ నివేదిక తేల్చింది. 2022 సంవత్సరంలో 40 పాయింట్ల నుంచి 2023లో 39 పాయింట్లకు తగ్గింది.

2023లో భారత్ 93వ స్థానంలో నిలిచింది. 2022లో భారత్ 85వ స్థానంలో ఉండేది. పాక్ 133, శ్రీలంక 115 ర్యాంకులో ఉండగా.. ఈ జాబితాలో చైనా 76వ స్థానంలో నిలిచింది.