ప్రపంచంలోని అతిపెద్ద శరణార్థుల శిబిరాలు ఇవే..!

27 November 2023

కాకుమా

వాయువ్య కెన్యాలో 1992లో స్థాపించబడిన కకుమా శరణార్థుల శిబిరం ఇప్పటి వరకు 2,01,000 మంది శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది.

కాకుమా

దక్షిణ సూడాన్, సోమాలియా ప్రాంతాల్లో అంతర్యుద్ధం నుండి తప్పించుకునే సూడానీస్ పిల్లలకు సహాయం చేయడానికి ఏర్పాటు చేయబడిన కాకుమా శిబిరం.

దాదాబ్ రెఫ్యూజీ కాంప్లెక్స్

కకుమాకు ఆగ్నేయంగా ఉన్న దాదాబ్ కాంప్లెక్స్, 2011లో అంతర్యుద్ధం నుండి తప్పించుకుంటున్న సోమాలి శరణార్థుల కోసం ఏర్పాటైంది.

దాదాబ్ రెఫ్యూజీ కాంప్లెక్స్

కరువు కాటకాల కారణంగా సోమాలి శరణార్థులకు 1991 దాదాబ్ ఆశ్రయం ఏర్పాటైంది. ఇందులో 2,40,000 మంది శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.

జాతారీ శిబిరం

2012లో జోర్డాన్‌లోని జాతారీ శిబిరం ప్రారంభమైంది. సిరియన్ శరణార్థుల కోసం ప్రపంచంలోనే అతిపెద్దదిగా అవతరించింది. ప్రస్తుతం 83,000 కంటే ఎక్కువ మంది సిరియన్లకు ఆతిథ్యం ఇస్తోంది.

కుటుపలోంగ్

2017లో రోహింగ్యా సంక్షోభం ఉద్భవించిన తర్వాత బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్ శిబిరం.. ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థి శిబిరంగా మారింది.

కుటుపలోంగ్

మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో హింస నుండి పారిపోతున్న 9,31,000 మంది రోహింగ్యా ముస్లింలకు కుటుపలోంగ్ శిబిరం ఆశ్రయం కల్పించింది.

ఉమ్ రకుబా

ఇథియోపియాలోని టిగ్రే ప్రాంత సంక్షోభం తర్వాత దేశం విడిచి వెళ్ళిన శరణార్ధుల కోసం సుడాన్‌లోని ఉమ్ రకుబా శిబిరం ఆశ్రయం కల్పించింది.

ఉమ్ రకుబా

నవంబర్ 2020లో ఇథియోపియాలో చెలరేగిన హింస నుండి పారిపోయిన 16,870 మంది శరణార్థులు ఉమ్ రకుబా శిబిరంలో తలదాచుకుంటున్నారు.