సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సదస్సుకు ఢిల్లీ ముస్తాబైంది. అత్యంత ప్రతిభావంతమైన దేశాల కూటమిగా పేరు పొందింది జీ 20.
19 దేశాలు, ఐరోపా సమాఖ్యల కూటమే జీ20. ప్రతి సంవత్సరం రొటేషన్ పద్ధతిలో ఒక గ్రూప్‌కు సారథ్య బాధ్యతల అవకాశం లభిస్తుంది.
సారథ్యం వహించే దేశం జీ20 అజెండాను ఖరారు చేస్తుంది. సమావేశాల తాలూకు నిర్వహణ ఖర్చులు, సిబ్బంది తరలింపు బాధ్యత సారథ్య దేశానిదే.
ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే స్ఫూర్తితో "వసుధైక కుటుంబం'' ఈసారి జీ20 సదస్సు ఇతివృత్తం.
సూక్షజీవులు మొదలు మనుషులు, జంతుజాలం అంతా ఈ భూమిపైనే ఒకే కుటుంబంలా జీవిస్తూ ఉమ్మడి భవిష్యత్తుతో ముందుగు సాగుతాయనేది ‘వసుధైక కుటుంబం’ అంతరార్థం.
ఈసారి సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, కెనెడా ప్రధాని ట్రూడో ఇంకా ఆస్ట్రేలియా ప్రధాని ఆల్చనీస్ చైనా తరపున లీ కియాంగ్ హాజరవుతారు
వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు మొదలు ఉక్రెయిన్ యుద్ధం దాకా ఎన్నో అంతర్జాతీయ అంశాలు ఈ భేటీలో చర్చకురానున్నాయి.