ఉపగ్రహ ప్రయోగంపై కిమ్ జాంగ్ కీలక వ్యాఖ్యలు

26 November 2023

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, ఉపగ్రహ ప్రయోగంపై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు.

దేశ భద్రత కోసం ఉపగ్రహ ప్రయోగం రెండు విఫల ప్రయత్నాల తర్వాత ఉత్తర కొరియా చేసిన మూడవ విజయవంతమైన ప్రయత్నం.

ఉత్తర కొరియా ఉపగ్రహ ప్రయోగం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనంటోంది దక్షిణ కొరియా. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

రష్యా నుండి లభించిన సహాయం కారణంగా ఉత్తర కొరియా ఈ ప్రయోగం విజయవంతమైందని దక్షిణ కొరియా అధికారి ఆరోపించారు.

లక్షల విలువ చేసే మందుగుండు సామాగ్రిని ఉత్తర కొరియా రష్యాకు అందించిందని ఆరోపించిన దక్షిణ కొరియా అధికారి.

అయితే దక్షణ కొరియా ఆయుధ ఒప్పందాం ఆరోపణలను రష్యా, ఉత్తర కొరియా రెండు దేశాలు కూడా స్పష్టంగా ఖండించాయి..

కిమ్ జోంగ్ నేషనల్ ఏరోస్పేస్ టెక్నాలజీ అడ్మినిస్ట్రేషన్ (NATA)కి వెళ్లి ఈ విజయంపై అంతరిక్ష శాస్త్రవేత్తను అభినందించారు.

ఈ ప్రయోగానికి ముందు, కిమ్ జోంగ్ రష్యాను సందర్శించారని, అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పియెంగెంగ్‌కు సహాయం చేస్తారని సౌత్ కొరియా చెబుతోంది.