ప్రపంచంలోనే అరుదైన పాస్ పోర్ట్ ఇదే.. కేవలం 500 మందికే!

TV9 Telugu

03 February 2024

అంతర్జాతీయ ప్రయాణం నిమిత్తం ప్రపంచంలోని ఏ దేశమైనా తన పౌరులకు జారీ చేసే గుర్తింపు పత్రమే పాస్ పోర్ట్.

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్ట్‌గా జపాన్ దేశానికి చెందిన పాస్ పోర్ట్. అరుదైన పాస్ పోర్ట్ గా ది సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా పాస్ పోర్ట్‌కు గుర్తింపు.

భౌతికంగా ఎలాంటి ఉనికి లేకపోయినా 120 దేశాలు గుర్తించడం ది సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా’కు ప్రత్యేకత.

ది సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా కొన్నేళ్ళ నుంచి అస్తిత్వం నిలబెట్టుకుంటూ వస్తోంది క్యాథలిక్ వ్యవస్థ.

వైద్య సాయం అందించే సంస్థగా, అంతర్జాతీయ దౌత్య గుర్తింపు పొందిన సంస్థగా ఇది మంచి గుర్తింపు తెచ్చుకుంది. .ఓ దేశంలాగే వ్యవహరిస్తుంది.

ది సావరిన్ మిలిటరీ ఆర్డర్ ఆఫ్ మాల్టా భౌతిక సరిహద్దులు లేకున్నా రాచరికపు హోదాలు, వివిధ పదవులు, ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు.

క్రీ.శ.1300 సంవత్సరం నుంచి ఈ పాస్ పోర్ట్ లు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఈ పాస్ పోర్టులను ప్రస్తుతం ప్రపంచంలోని 120 దేశాలకు వర్తిస్తుంది.

ది సావరిన్ ఆర్డర్ ఆఫ్ మాల్టా పాస్ పోర్టు ఉన్న వారిని113 దేశాలు వీటిని ప్రయాణ అనుమతి పత్రాలుగా అంగీకరిస్తున్నాయి.