ఉడికే నది.. అందులో పడితే క్షణాల్లో ప్రాణం పోవడమే.. 

30 December 2023

ఎప్పుడైనా నదుల దగ్గరకు వెళ్ళినా.. నది మీద ప్రయాణించినా నీరు చల్లగా ఉంటుందని. చల్లటి గాలులు పలకరిస్తాయి. కొన్ని నదుల నీరు తాగడానికి అమృతం అని కూడా అంటారు.  

ఈ నది భిన్నమైనది 

అయితే ఓ నది అన్ని నదులకంటే భిన్నమైనది. ఆ నది దగ్గరకు వెళ్తే మాత్రం వేడి గాలులు, వేడి నీటి ఆవిరితో ఉక్కపోతగా అనిపిస్తుంది. నీరు మరుగుతున్న ఫీలింగ్ ను ఇస్తుంది. 

మరిగే నీరు 

ఈ నది అమెజాన్ అడవులలో ఉంది. ఇక్కడ ఈ బాయిలింగ్ రివర్  ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. దీనిలో నీరు అన్ని సమయాలలో వేడిగా ఉంటుంది. 

బాయిలింగ్ రివర్ 

దక్షిణ అమెరికాలోని... పెరూ దేశంలో అత్యంత దట్టమైన అమెజాన్ అడవిలో... ఆ నది రహస్యంగా ఉంది. బయటకు పెద్దగా కనిపించదు.

అత్యధిక ఉష్ణోగ్రత

ఈ నీటితో బియ్యం ఈజీగా ఉడకబెట్టవచ్చు. ఈ నదిలో ఏ జీవి పడినా ఇక ఆ జీవి బతకదు. నదిలోని నీరు వేడి నీటి ఆవిరి పైకి ఎగసి పడుతూ ఉంటుంది. 

పైకి ఎగసి పడే ఆవిరి 

ఈ నది ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. అందుకే  ఈ ప్రమాదకరమైన నదిపై ప్రకృతి ప్రత్యేకమైన దృశ్యాన్ని చూడటానికి చాలా మంది ఇక్కడకు వస్తారు.

 పర్యాటకులను ఆకర్షించే 

అమెజాన్‌లో ప్రాణాలను పణంగా పెట్టి ఆండ్రెస్ రుజో ఈ నదిని పరిశోధించాడు. అతను భూగర్భ సైంటిస్ట్. తన టీమ్‌తో కలిసి ప్రపంచానికి బాయిలింగ్ రివర్ ను చూపించాడు.

ఎవరు కనిపెట్టారంటే