2024 సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను విడుదల చేసిన గ్లోబల్ ఫైర్ పవర్.
ఈ ఏడాది ప్రకటించిన ఈ దేశాల జాబితా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచిన అమెరికా దేశం.
గ్లోబల్ ఫైర్ పవర్ నివేదిక ప్రకారం, రష్యా ప్రపంచంలో రెండవ అత్యంత శక్తివంతమైన దేశం. రష్యా శక్తి సూచిక 0.0702.
మూడవ అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరించిన భారత్ పొరుగు దేశం చైనా. నూచికలో చైనా 0.0706 పాయింట్లు సాధించింది.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత్. భారతదేశ శక్తి సూచిక 0.1416 పాయింట్లు.
సైనిక శక్తి, ఆర్థిక స్థిరత్వం వంటి 60 కీలక అంశాల ప్రాతిపదికన శక్తివంతమైన దేశాల ర్యాంకింగ్ నిర్ధారణ జరిగింది.
మొత్తం 145 దేశాలను పోల్చి, వాటి సైనిక బలానికి సంబంధించి నివేదికను విడుదల చేసిన ప్రముఖ సంస్థ గ్లోబల్ ఫైర్ పవర్.
దక్షిణ కొరియా ఐదో స్థానంలో, ఇంగ్లండ్ ఆరో స్థానంలో, జపాన్ ఏడో స్థానంలో, టర్కీ ఎనిమిదో స్థానంలో, పాకిస్థాన్ తొమ్మిదో స్థానంలో, ఇటలీ పదో స్థానంలో నిలిచాయి.