21 August 2023

పాకిస్తాన్‌లో టమాటో రేటు ఎంతో తెలుసా..

ఇరాన్ టమోటాలు మార్కెట్‌కు రాకపోవడంతో పాకిస్థాన్‌లో టమాటా ధర రికార్డు స్థాయికి చేరుకుంది.

పాకిస్థాన్‌లో టమాటా ధర రికార్డు స్థాయిలో పెరిగింది. కిలో రూ.300 నుంచి రూ.400కి చేరుకుంది. 

 గత ఏడాది ధరలతో పోల్చితే ఈ ధరలు పెద్దగా ప్రభావం చూపడం లేదని ది డాన్ పత్రిక తెలిపింది.

పాకిస్తాన్‌కు ఇరాన్ మార్కెట్ నుంచి టమాటా దిగుమతి తగ్గడంతో భారత్‌ను అభ్యర్థించింది అక్కడి ప్రభుత్వం.

పాకిస్తాన్‌లో టొమాటోల టోకు ధరలు కిలోకు రూ. 300 దాటడం ఇదే మొదటిసారి అని ఎగుమతిదారు అంటున్నారు.

పాకిస్థాన్‌లో హోటళ్లు , పెద్ద రెస్టారెంట్లు మాత్రమే టమాటాలను అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నాయని తెలుస్తోంది.