TV9 Telugu

UKలో పౌరసత్వం ఎలా పొందాలి..?

22 Febraury 2024

భారతదేశంలో చాలామంది వేరే దేశనికి వెళ్లి బిడ్డని కంటే ఆ శిశువుకి అక్కడి పౌరసత్వం వస్తుందని అనుకుంటారు.

కానీ అది మీ ఊహ మాత్రమే. విదేశీ పౌరసత్వం కావాలంటే ప్రపంచంలో ఒక్కో దేశానికీ వేరువేరు నియమ నిబంధనలు ఉంటాయి.

చాలామంది భారతీయులు అమెరికా, యూకే వంటి దేశాల పౌరసత్వం తీసుకోవలుకుంటారు. కొంతమంది ఇప్పటికే తీసుకున్నారు కూడా.

UKలో పౌరసత్వం పొందడానికి, మొదటి 5 సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే వీసాతో ఉన్న తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రస్తుతం, శాశ్వత UK పౌరసత్వం పొందడానికి, పాయింట్ సిస్టమ్‌ను అనుసరించాలి. దరఖాస్తుదారులకు వేర్వేరు పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది.

నిబంధనలను పాటించనందుకు పాయింట్లు తీసివేస్తారు. నిర్దిష్ట పాయింట్‌ను సాధించిన తర్వాత మాత్రమే శాశ్వత పౌరసత్వం లభిస్తుంది.

విదేశాలకు చెందిన వ్యక్తి బ్రిటిష్ పౌరుడిని వివాహం చేసుకుంటే, అతనికి అక్కడ పౌరసత్వం పొందడం సులభం అవుతుంది.

తమ దేశంలో సామాజిక సేవలు, సామాజిక భద్రతపై యునైటెడ్ కింగ్‌డమ్ (UK) ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకువచ్చింది.