బంగ్లాదేశ్‌లో ఎంత మంది హిందువులు ఉన్నారు..?

TV9 Telugu

07 August 2024

బంగ్లాదేశ్‌లో విధ్వంసకాండ కొనసాగుతోంది. ఆ దేశంలో మొత్తం అన్ని ప్రదేశాల్లో అల్లర్లలో అట్టుడికిపోతోంది.

రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన మంటలు... దేశం మొత్తాన్ని తగలబెట్టేస్తున్నాయి. రాజధాని ఢాకాలో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది.

సైన్యం సైతం ఆందోళనకారుల్ని కంట్రోల్‌ చేయలేకపోతోంది. ఇప్పటివరకు 400మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

బంగ్లాదేశ్‌లోని హిందూ ఇళ్లు, దేవాలయాలు మొదలైన వాటిపై కూడా దాడులు జరిగాయి. దీని జనాభా 174 మిలియన్లు, అందులో 91% ముస్లింలు, 8% హిందువులు.

భారత్ - పాక్ విభజన తర్వాత, అప్పటి తూర్పు పాకిస్తాన్‌లో హిందువులు 22 శాతం. 2011కి హిందువుల 8.5 శాతం కాగా, ఇప్పుడు అది 8 శాతానికి తగ్గింది.

అప్పటి నుండి బంగ్లాదేశ్ ముస్లింల వాటా 76% నుండి 91%కి పెరిగింది. 1964 - 2013 మధ్య 11 మిలియన్లకు పైగా హిందువులు వలస వెళ్ళిపోయారు.

మతపరమైన హింస కారణంగా ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్‌లో దాదాపు 2.30 లక్షల మంది హిందువులు దేశం విడిచి వెళ్తున్నారు.

2011 జరిగిన జనాభా లెక్కల ప్రకారం 2000, 2010 మధ్య బంగ్లాదేశ్ నుండి 1 మిలియన్ హిందువులు అదృశ్యమయ్యారు.