నేపాల్‌కు వెళ్తున్నారా.. ఈ ఫుడ్‌ని ట్రై చేయండి.. 

21 November 2023

భారతదేశానికి పొరుగు దేశం నేపాల్. అందమైన లోయలతో పర్యాటకులను ఆర్షిస్తుంది. నేపాల్‌కు భారీ లాభాలు రావడానికి కారణం దీని సహజ సౌందర్యమే. 

నేపాల్ సహజ సౌందర్యం

ఇది నేపాల్‌ సాంప్రదాయ తీపి వంటకం. నేపాల్ పండుగలలో సెల్ రోటీకి ప్రధాన స్థానం. సాధారణ డోనట్స్ కంటే తక్కువ తీపి కలిగి ఉంటుంది

సెల్ రోటీ

భారతదేశం వలె, నేపాల్‌లో దాల్ భాత్‌ను చాలా ఇష్టంగా తింటారు. ఇది అన్నం, సూప్, వెజిటబుల్ కర్రీ లేదా చికెన్‌తో వడ్డిస్తారు. ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. 

దాల్ భాత్‌

నేపాల్ ప్రసిద్ధ వంటకం జుజు ధౌను ను 'కింగ్ దహి' అని కూడా పిలుస్తారు. ఇది క్రీము, తీపి వంటకం. స్థానికులు ఈ స్వీట్‌ని ఇష్టపడతారు.

జుజు ధౌ

ఇది కూడా నేపాల్ కి చెందిన తీపి వంటకం. బియ్యపు పిండిని కొబ్బరితో నింపి తయారు చేస్తారు. నేపాల్‌లోని చాలా ఇళ్లలో లేదా దుకాణాల్లో ఈజీగా దొరుకుంది. 

యోమారి  

నేపాల్ లో అత్యంత ప్రసిద్ధ ఆహారాల్లో ఒకటి దిదో. దీనిని రాజ్మా పౌడర్, నీరు కలిపి, పిండి చిక్కబడే వరకు ఉడికించి తయారు చేస్తారు. దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.

దిదో

నేపాల్‌లోనూ మోమోస్‌ క్రేజ్‌ బాగా పెరిగింది. ఆసియా దేశాల్లోని ప్రజలకు అత్యంత ఇష్టమైన ఆహారంగా మోమోస్ మారాయి. 

మోమోస్

గుడ్ పాక్ నేపాల్‌లో అత్యంత ఇష్టపడే డెజర్ట్‌లలో ఒకటి. దీనిలోని పోషకాల కారణంగా ప్రజలు ఎక్కువగా ఇష్టంగా తింటారు.

గుడ్ పాక్