ప్రపంచ టెక్‌ సంస్థలకు సీఈవోలుగా స్వలింగ సంపర్కులు..

TV9 Telugu

09 February 2024

ప్రపంచ దిగ్గజ టెక్‌ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న సీఈఓలు తమ వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలు అశ్చర్చపరుస్తాయి.

ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీల సీఈవోలు తమను తాము ‘స్వలింగ సంపర్కులు’గా ప్రకటించుకున్నారు. వారిలో కొందరి వివరాలు చూద్దాం.

ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ ఆలివర్‌ మల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. 17 ఏళ్ళ వయసులో తాను స్వలింగ సంపర్కుడు అని ప్రకటించుకున్నారు.

యాపిల్‌ సీఈవో టిమ్ కుక్ 2014లో స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్నారు. ‘శాన్ ఫ్రాన్సిస్కో గే ప్రైడ్ పరేడ్‌’లో యాపిల్ సిబ్బందితో కలిసి పాల్గొన్న సందర్భంగా ప్రకటించారు.

2016లో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో పీటర్ థీల్ తాను స్వలింగ సంపర్కుడిగా చెప్పారు. 2002లో, ‘ఈబే’ పేపాల్‌ను 1.5 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది.

మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు ఫేస్‌బుక్ నలుగురు సహ వ్యవస్థాపకులలో క్రిస్ హ్యూస్ ఒకరు. అతడు బహిరంగంగా ‘స్వలింగ సంపర్కుడు’ అని ప్రకటించుకున్నారు.

క్లాడియా బ్రిండ్‌ ఐబీఎంలో ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీకి వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తాను ఒక స్వలింగ సంపర్కం అని ప్రకటించారు.

యాపిల్‌, గూగుల్‌, ఇన్‌టుఇట్‌ కంపెనీల్లో కీలక స్థానాల్లో పని చేసిన ఆన్ మే చాంగ్ ప్రస్తుతం  స్వలింగ సంపర్కుల హక్కుల కోసం వివిధ వేదికలపై ఆమె పోరాడుతున్నారు.