ప్రపంచంలో నంబర్ 1 దేశం ఏదో తెలుసా..?
TV9 Telugu
17 March 2024
అమెరికా దేశానికి చెందిన యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ ప్రపంచంలోని అతిపెద్ద దేశాల జాబితాను విడుదల చేసింది.
US న్యూస్ & వరల్డ్ అనేది ఒక అమెరికన్ వార్తా సంస్థ. ప్రతి ఏటా వివిధ అంశాలపై అధ్యయనం చేసి ఉత్తమ దేశాల జాబితాను ప్రకటిస్తుంది.
ఆర్థిక వ్యవస్థ, జనాభా, ఆధునికత మొదలైన అనేక అంశాలలో అన్ని దేశాలు అంచనా వేసి తుది జాబితాను విడుదల చేస్తుంది.
.తాజాగా విడుదల చేసిన జాబితాలో కెనడా మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశం ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలిచింది.
జపాన్ 99.1 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇది వ్యవస్థాపకత రంగంలో అతిపెద్దదిగా స్థానం దక్కించుకుంది.
జర్మనీ దేశం 98 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. వేగవంతమైన మార్పులో జర్మనీ దేశం 4వ స్థానంలో కొనసాగింది.
ఆ తర్వాత స్విట్జర్లాండ్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ దేశం స్కోరు 97.3 పాయింట్లుగా ఈ జాబితా చెబుతుంది.
ఇది కాకుండా ఆస్ట్రేలియా 96.6 స్కోరుతో ఐదో స్థానంలో ఉంది. అమెరికా 93.3 పాయింట్ల స్కోర్‌తో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి