ప్రపంచంలో అత్యంత సంపన్న ముస్లిం దేశం ఏది తెలుసా ?
TV9 Telugu
02 January 2024
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో దాదాపు 49 దేశాలు ముస్లింలు మెజారిటీగా ఉన్నారని నివేదకులు చెబుతున్నాయి.
బ్రూనై ప్రపంచంలోనే అత్యంత సంపన్న ముస్లిం దేశం. ఈ దేశంలో ప్రకృతి పరమైన అందాలకు కూడా ఏ మాత్రం కొదవేలేదు.
ఇది ఆగ్నేయాసియాలోని ఉన్న ఒక చిన్న దేశం. పసిడి (బంగారం)తో అలంకరించిన అద్భుత ప్రాంగణం కలిగి ఉన్న దేశం బ్రూనై.
ముస్లిం దేశం బ్రూనైలో నివసిస్తున్న ప్రజలకి అక్కడ ప్రభుత్వం ఉచిత వైద్య సదుపాయాలు, విద్యను అందిస్తుంది.
ఇక్కడ కరెన్సీ బ్రూనై డాలర్‌తో కొలుస్తారు. ఇక్కడి ప్రజలు చాలా ఓపెన్ మైండెడ్‌గా ఉంటారు. ఈ దేశ చట్టం ప్రకారం వేలు చూపడం నేరం.
వేలు చూపిన వ్యక్తులకు కఠిన శిక్షలు ఉంటాయి. దేశంలో అత్యధికంగా చమురు, గ్యాస్ నిల్వల కారణంగా బ్రూనైలో తలసరి ఆదాయం రూ. 53 లక్షలు.
ధనిక దేశాలతో పోల్చితే, బ్రూనై ఐదవ ధనిక దేశం. అలాగే మొదటి సంపన్న ముస్లిం దేశం. మద్యం విక్రయించడం, మద్యం సేవించడం పూర్తి నిషేధం ఉంది.
ముస్లిం దేశం అయిన బ్రూనైలో విచిత్రమైన సంప్రదాయం ఉంది. ప్రతీ ఇంటి గోడపై ఆ ఇంటి యజమాని భార్య ఫోటో ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి