అత్యధికంగా క్రెడిట్ కార్డ్ వాడుతున్న దేశం ఏదో తెలుసా..?

25 December 2023

TV9 Telugu

కెనడా దేశ జనాభాలో 82.74 శాతం మందికి క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నట్టు తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది.

అలాగే రెండో స్థానంలో ఉన్న ఇజ్రాయెల్ జనాభాలో 79.05 శాతం మంది క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారని వెల్లడి.

ఇక మూడో స్థానం ఐస్‌లాండ్ దేశానిది. ఆ దేశ జనాభాలో 74 శాతం మంది ప్రజలు క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారు.

హాంకాంగ్ జనాభాలో 71.63 శాతం మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్లుగా ఉన్నారు. ఈ దేశం ఐదవ స్థానంలో నిలిచింది.

జపాన్‌లో క్రెడిట్ కార్డ్ వాడకం ఎక్కువే. ఆ దేశ జనాభాలో 69.66 శాతం మంది క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారు.

స్విట్జర్లాండ్‌లో ఆ దేశ జనాభాలో 69.21 శాతం మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారని అధ్యయనంలో తెలిసింది.

ఇక దక్షిణ కొరియా దేశ జనాభాలో 68.44 శాతం మంది క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారు. నార్వే జనాభాలో 66.74 శాతం మంది క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు.

ఇక మన భారత దేశం జనాభాలో కేవలం 4.62 శాతం మందికి మాత్రమే క్రెడిట్ కార్డులు ఉన్నాయని ఈ అధ్యయనంలో తెలిసింది.