TV9 Telugu

నేపాల్‌లో అత్యంత సంపన్నులు.. ఎంత మంది తెలుసా..?

29 Febraury 2024

నేపాల్ అనగానే మొదట గుర్తుకు వచ్చేది హిమాలయాలు. ఇది ఒక హిందూ దేశం. ఇక్కడ ఉన్న దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి.

నేపాల్ దేశం ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. కానీ ప్రపంచ ధనవంతులలో ఒక వ్యక్తి నేపాల్ కి చెందినవాడు.

డాక్టర్ బినోద్ చౌదరి నేపాల్ అత్యంత ధనవంతులలో ఒకరు. అతను నేపాల్ దేశంలోనే మొదటి బిలియనీర్ కావడం విశేషం.

ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో డాక్టర్ బినోద్ చౌదరి చోటు దక్కించుకున్నారు. ఇందులో అతని ర్యాంక్ 1660.

బినోద్‌ స్వస్థలం రాజస్థాన్‌లోని ఫతేపూర్‌. వ్యాపార బాధ్యతలు తీసుకున్న తర్వాత చౌదరి గ్రూప్‌ను స్థాపించాడు.

బినోద్ చౌదరి తన పూర్వీకుల వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాడు. అతని గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ హోటళ్లను నడుపుతోంది.

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని హోటల్ రాంబాగ్‌లో బినోద్ చౌదరి కుమారుడు రాహుల్ వివాహం ఘనంగా నిర్వహించారు.

అట్టహాసంగా జరిగిన రాహుల్ వివాహానికి దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, నటులు హాజరయ్యారు.