ప్రపంచంలోనే తొలిసారి ఒక దోషికి అమెరికాలోని అలబామా అధికారులు నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అమలు చేశారు.
58 ఏళ్ల యూజీన్ స్మిత్ అనే నేరస్థుడికి ఫేస్‌మాస్క్ ద్వారా నైట్రోజన్ గ్యాస్ ఇచ్చి మరణశిక్ష విధించారు. 1998 నాటి ఓ కేసుకు సంబంధించి శిక్షను తాజా అమలు చేశారు.
అమెరికాలో నిందితుడు స్మిత్ ఓ మహిళను హత్య చేశాడు. ఈ కేసులో అతనికి నైట్రోజన్ వాయువు ద్వారా మరణశిక్ష విధించాలని కోర్టు తీర్పునిచ్చింది.
ఈ పద్ధతిలో మరణశిక్ష విధిస్తే, అపరాధిని ముందుగా రెస్పిరేటర్ మాస్క్‌ని ధరించి నైట్రోజన్ వాయువు విడుదల చేస్తారు.
ముసుగు నుండి నైట్రోజన్ వాయువు విడుదలైన తర్వాత, దోషి శరీరంలో ఆక్సిజన్ లేకపోవడంతో అతను స్పృహ కోల్పోతాడు.
నైట్రోజన్ వాయువు ప్రభావం వేగంగా కనిపిస్తుంది. దోషి శరీరంలోకి నైట్రోజన్ వాయువు వెళ్ళిన కొన్ని నిమిషాల్లో చనిపోతారు.
అమెరికాలోని అలబామాలో నేరస్థుడికి జనవరి 26 రోజున నైట్రోజన్ మరణశిక్ష విధించడం జరిగింది. అమెరికాలో ఇలాంటి శిక్ష విధించడం ఇదే తొలిసారి.
తొలుత కోర్టు 2022లో ఇంజెక్షన్‌తో స్మిత్‌కు మరణదండన అమలు చేసేందుకు ప్రయత్నించగా, చివరి నిమిషంలో నిలిపివేశారు. తాజాగా నైట్రోజన్‌తో మరణశిక్ష విధించారు.