TV9 Telugu

రాజుల కోటకు కాకులు కాపలా !

03 March 2024

లండన్‌లో వెయ్యేళ్ల నాటి కోట పేరు ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌'. ఈ కోటకు ఏటా 30 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. కోటకు కాకులే సంరక్షకులు.

ఆ కాకులను కాపలా కాస్తూ వాటి యోగక్షేమాలను చూడటం కోసం ఓ వ్యక్తిని ఉద్యోగంలో నియమించారు బ్రిటన్ రాచ కుటుంబం.

‘కాకుల మాస్టర్‌’ ఉద్యోగ బాధ్యతలను తాజాగా స్వీకరించిన మైకెల్‌ రాయల్‌ మెరైన్‌ మాజీ సైనికుడు. అతనితో పాటు మరో నలుగురు సిబ్బంది పని చేస్తారు.

కింగ్‌ విలియం -1 ఇంగ్లాండును జయించిన తర్వాత 1066లో ఈ కోటను నిర్మించారు. మొదట్లో రాజభవనంగా ఉన్న కోట తర్వాత చెరసాలగా మారింది.

కాకులు కోటను వీడి వెళ్లిపోయిన రోజున టవర్‌ ఆఫ్‌ లండన్‌తో పాటు ఇంగ్లాండ్‌ రాజ్యం కూలిపోతుందని బలంగా నమ్ముతారు.

గత ఏడాది కింగ్‌ ఛార్లెస్‌ - 3 పట్టాభిషేకం జరిగాక కాకుల సంఖ్యను ఏడుగా మార్చారు. ఈ కాకులు ఎగిరిపోకుండా రెక్కలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉంటారు.

నిత్యం వాటికి మాంసాహారం, ఉడికించిన గుడ్లు, బిస్కెట్లు అందిస్తూ వెటర్నరీ పరీక్షలు కూడా చేయిస్తుంటారు.

రోజంతా ఇలా హాయిగా తింటూ తిరిగే కాకులు రాత్రివేళ పంజరాల్లోకి వెళ్లి నిద్రిస్తాయి. ఈ టవర్‌ను చూసేందుకు ఏటా 30 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు.