భారతీయులు వీసా లేకుండా ఏయే దేశాలకు వెళ్ళొచ్చొ తెలుసా..!
08 December 2023
2023 సంవత్సరంలో భారతదేశం నుండి 2,83,885 మంది పర్యాటకులు మలేషియాకు వెళ్లారు. భారతీయ పౌరులు ఎటువంటి వీసా లేకుండా 19 దేశాలలో ప్రవేశించవచ్చు.
తాజాగా చేసిన గణాంకాల ప్రకారం, గత ఏడాది 1 కోటి 80 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్లారని తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా వీసాతో పని లేకుండా భారతీయులకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించే దేశాలు చాలానే ఉన్నాయి.
మలేషియా, మాల్దీవులు, భూటాన్, నేపాల్, హాంకాంగ్, మారిషస్ మరియు థాయ్‌లాండ్ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
హైతీ, గ్రెనడా, మోంట్‌సెరాట్, సెనెగల్, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, బార్బడోస్‌లలో కూడా భారతీయులకు వీసా అవసరం లేదు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, 26 దేశాల్లోని భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో ఉంది.
25 దేశాలు భారతీయులకు ఈ-వీసా సౌకర్యాన్ని అందిస్తాయి. భారతీయులు వీసా లేకుండా ఆరు నెలల పాటు థాయ్‌లాండ్‌లో ఉండవచ్చు.
వియత్నాం దేశం కూడా భారతదేశం నుంచి అవసరాల కోసం వచ్చే వారందరికీ ఉచిత ప్రవేశ వీసా ఇవ్వాలని ఆలోచిస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి