TV9 Telugu

భారతీయులు లేని దేశం ఏదో తెలుసా..?

22 Febraury 2024

ప్రపంచంలోని 195 దేశాల్లో అత్యధికంగా భారతీయులు నివసిస్తున్నారు. సుమారు కోటి మంది ఉంటారని అంచనా వేశారు.

ఎక్కువగా భారతీయులు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వివిధ మూలల్లో తమ స్థిర నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నారు.

అయితే ఈ ప్రపంచంలో భారతీయులు లేని దేశాలు కొన్ని ఉన్నాయని మీకు తెలుసా. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే 17 దేశాల్లో ఒక్క భారతీయుడు కూడా జీవించడం లేదని తాజాగా ఓ సర్వే తేల్చి చెప్పింది.

వాటికన్ సిటీలో ఒక్క భారతీయుడు కూడా నివసించడం లేదు. పోప్, అతని సహాయకులు మాత్రమే వాటికన్ సిటీలో నివసిస్తున్నారు.

శాన్ మారినో, తువాలు దేశాల్లో జనాభా కేవలం 33,000 లోపే. ఇక్కడ సౌకర్యాల లేమి కారణంగా భారతీయులు వెళ్లలేదు.

పాకిస్తాన్‌లో నేటికి భారతీయులెవరూ నివసించటం లేదు. ఉత్తర కొరియా, బెలారస్, తుర్క్మెనిస్తాన్ వంటి ఆసియా దేశాల్లోనూ భారతీయులు నివసించడంలేదు.

ఆయా దేశాల్లో భారతీయులు నివసించకపోవడానికి రాజకీయ, సామాజిక, ఆర్థిక వంటి అనేక కారణాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.