మిస్‌ వరల్డ్‌లో క్రిస్టీనా అద్భుత ప్రదర్శన

TV9 Telugu

12 March 2024

ఇటీవల ముంబైలో జరిగిన 71వ మిస్ వరల్డ్ పోటీల్లో చెక్‌ రిపబ్లిక్ దేశానికి చెందిన 24 ఏళ్ల క్రిస్టీనా పిస్కోవా విజేతగా నిలిచింది.

115 దేశాలకు చెందిన అందగత్తెలలో మద్య ఆమే విజేత. చిన్నప్పటి నుంచి ప్రతిభావంతురాలిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఏ పనినైనా సంకల్పం, పట్టుదలతో పూర్తి చేస్తుందని ఆమెకు పేరుంది. మిస్ వరల్డ్ కిరీటాన్ని కూడా ఎంతో కష్టపడి సాధించింది.

క్రిస్టీనా పిస్కోవా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన చిన్నారులకు టాంజానియాలో స్కూల్‌ నెలకొల్పింది.

ఈ స్కూల్లో పిల్లలకు చదువు అందించడంతో పాటు వృద్ధులు, మానసిక వికలాంగుల ఆలనా పాలనా కూడా చూస్తోంది క్రిస్టీనా పిస్కోవా.

లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డ్యుయెల్ డిగ్రీ చేసినా మోడలింగ్‌పై ఆసక్తితో ఆ దిశగా ఆమె అడుగులు వేసింది.

2022లో లండన్‌ దేశంలోని ప్రముఖ ఎలీట్ మోడల్ మేనేజ్‌మెంట్‌లో చేరి చాలా విషయాలపై అవగాహన పెంచుకుంది ఈ సుందరి.

‘మిస్ చెక్ రిపబ్లిక్’ పోటీల్లో మొదటి ప్రయత్నంలోనే విజేతగా నిలిచింది. తర్వాత ఇప్పుడు మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది.