పక్షవాతానికి గురైన జెరోదా సీఈవో నితిన్.. ప్రముఖ వ్యాపారి సలహా..
27 Febraury 2024
నితిన్ కామత్ కొన్ని వారాల క్రితం పక్షవాతం బారినపడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆరు వారాల క్రితం అనూహ్యంగా తాను స్వల్ప పక్షవాతానికి గురయ్యాననీ తెలిపారు జెరోదా సీఈవో నితిన్ కామత్.
తన నాన్న మరణం, నిద్రలేమి, తీవ్ర మానసిక అలసట, డీహైడ్రేషన్, పని ఒత్తిడి తన అనారోగ్యానికి కారణం కావొచ్చు అని రాసుకొచ్చారు.
అనారోగ్యంవల్ల తన ముఖం వంకర తిరిగిందనీ చదవడం, రాయడం వంటివి కూడా చేయలేకపోయాననీ ఇప్పుడు కాస్త నయమైందనీ అన్నారు.
పూర్తిగా కోలుకోవడానికి 3 నుంచి 6 నెలలు పడుతుందనీ ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునే తనకు ఇలా ఎలా జరిగిందని ఆశ్చర్యపోయాననీ చెప్పారు.
పని ఒత్తిడిని ఎప్పుడు తగ్గించుకోవాలో తెలుసుకోవాలని వైద్యులు చెప్పారనీ ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేయగలుగుతున్నాననీ 44 ఏళ్ల నితిన్ కామత్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను కామత్ షేర్ చేశారు. ఆయన ఆరోగ్యం గురించి తెలియగానే ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ స్పందించారు.
డ్యూడ్.. కాస్త జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసి మీ తండ్రి మరణమే మీ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపి ఉంటుంది అని సూచించారు.