03 November 2023
Pic credit - Pixabay
భూటాన్ ప్రకృతి అందాలకే కాదు విచిత్రమైన వాస్తవాలకు కూడా పేరుగాంచింది. అనేక నియమాలు, నిబంధనలు ఉన్నాయి. ఇవి ఈ దేశాన్ని ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి భిన్నంగా చూపిస్తాయి.
భూటాన్ అనేక మఠాలకు, కోటలకు నిలయం. వీటిని dzongs అని పిలుస్తారు. వాటిని మతపరంగా అంటే పూజకు కూడా ఉపయోగిస్తారు.
భూటాన్‌లో రోడ్లు ఉన్నాయి కానీ ఎక్కడా ట్రాఫిక్ లైట్లు లేవు. అయితే ట్రాఫిక్ లైట్లు లేని దేశం భూటాన్ మాత్రమే కాదు.
భూటాన్ పరిసరాలకు కీడు కలిగించే పనులకు అనుమతి ఉండదు. ఆ దేశంలో పొగాకు తాగడం నిషేధించబడింది. ఎవరూ పొగాకు తాగకూడదు.
భూటాన్ ప్రభుత్వం, ప్రజలు పర్యావరణ పరిరక్షణ గురించి చాలా స్పృహని కలిగి ఉంటారు. భూటాన్‌లో కనీసం 60% అటవీ విస్తీర్ణంలో ఉండేలా రాజ్యాంగబద్ధమైన ఆదేశం ఉంది.
సనాతన ధర్మాన్ని సంస్కృతిని కాపాడుతూ అధునికతను అనుసరిస్తూ సమతూకాన్ని కాపాడుతూ అభివృద్ధి పథంలో నడుస్తోంది భూటాన్