TV9 Telugu

పాకిస్థాన్‌లో బ్రహ్మాణులు ఉన్నారా..?

04 March 2024

పాకిస్తాన్‌లో ముస్లింలతోపాటు హిందువులు కూడా నివసిస్తున్నారు. వీరి మొత్తం జనాభా దాదాపు 2 శాతంగా ఉంది.

ముస్లిం దేశంలో హుస్సేనీ బ్రాహ్మణులు పాకిస్తాన్‌లో నివసిస్తున్నారు. వీరు హిందూ బ్రాహ్మణులుగా పరిగణించబడుతారు.

హుస్సేనీ బ్రాహ్మణులు పంజాబ్‌లోని మోహయల్ కమ్యూనిటీకి చెందిన బ్రాహ్మణులు. వీరంతా ముస్లిం సాంప్రదాయాలను పాటిస్తారు.

పాక్ లో నివసిస్తున్న హుస్సేనీ బ్రాహ్మణుల్లో కొంత మంది ఇటు హిందూ, అటు ఇస్లాం మతాలకు చెందినవారు కూడా ఉన్నారు.

హుస్సేనీ బ్రాహ్మణులు పాకిస్తాన్‌లోని సింధ్, లాహోర్‌ ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

ముస్లిం మతపరమైన దేశమైన పాకిస్థాన్‌లో ఉంటున్న అనేక హిందూ కులాలు తమ మతాన్ని ఇస్లాంలోకి మార్చుకున్నాయి.

పాకిస్తాన్ దేశ ప్రసిద్ధ కవి అల్లామా ఇక్బాల్ కూడా మతం మార్చుకున్న ఓ హిందూ బ్రాహ్మణుని మనవడు కావడం విశేషం.

పాకిస్థాన్ దేశంలోని చాలా మందికి బ్రాహ్మణులు అనే మూలాలు తెలియవు. హుస్సేనీ బ్రాహ్మణ అనేది పంజాబ్ ప్రాంతంలోని మోహ్యాల్ బ్రాహ్మణ సంఘం.