హైదరాబాద్‌ నగరానికి మరో అరుదైన గుర్తింపు

13 December 2023

భారతదేశంలోనే బెస్ట్‌ సిటీ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ గా గుర్తింపు వరుసగా ఆరోసారి టాప్‌ స్థానం దక్కింది.

ప్రస్తుతం విశ్వనగరంగా దూసుకెళ్తున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది.

ప్రపంచంలో మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాను క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ రిపోర్ట్‌ పేరిట మెర్సర్స్‌ కంపెనీ విడుదల చేసింది.

వియన్నా ( ఆస్ట్రియా)కి ఉన్న ఘనమైన చరిత్ర, అద్భుతమైన కట్టడాలు, సాంస్కృతికత వంటి వివిధ కారణాలతో అత్యంత జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా మొదటి స్థానంలో నిలిచింది.

వియన్నా తర్వాత రెండో స్థానంలో జురిచ్‌ (స్విట్జర్లాండ్‌), మూడో స్థానంలో ఆక్లాండ్‌ (న్యూజిలాండ్‌) నిలిచాయి.

ఇక మన దేశం విషయానికొస్తే ఈ జాబితాలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ( 153వ స్థానం) అగ్రస్థానంలో నిలిచింది.

ఆ తర్వాత పుణె (154) రెండో స్థానం, బెంగళూరు (156) మూడో స్థానం, చెన్నై ( 161) నాలుగో స్థానం, ముంబై (164) ఐదో స్థానం దక్కింది.

ఇక ఈ ర్యాంకింగ్స్‌లో ఖార్టౌమ్‌(సూడాన్‌) 241వ ర్యాంక్‌తో అట్టడుగున నిలిచింది. ఆ తర్వాత ఇరాక్‌లోని బాగ్దాద్‌ 240వ ర్యాంకులో ఉంది.