వీసా లేకుండా భారతీయులకు ఎంట్రీ చెప్పిన మరో కంట్రీ!

TV9 Telugu

07 February  2024

భారతీయులకు వీసా మినహాయింపు ఇచ్చిన దేశాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఆ జాబితాలో ఇరాన్ దేశం కూడా చేరింది.

ఫిబ్రవరి 4 నుంచి భారతీయ పర్యాటకులు 15 రోజులపాటు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చింది.

ఇరాన్‌లో పర్యలించాలంటే నాలుగు షరతులు వర్తిస్తాయని ఢిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది.

విమాన మార్గం ద్వారా వచ్చే ప్రయాణికులకే మాత్రమే వీసా లేకుండా ప్రయాణించేందుకు అనుమతినిస్తారని తెలిపింది.

భారత్,UAE, సౌదీ అరేబియా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, మలేషియాతో సహా 32 దేశాలకు కొత్త వీసా-రహిత ప్రోగ్రామ్‌ ఆమోదించిన ఇరాన్.

సాధారణ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న వ్యక్తులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి.

పర్యాటక ప్రయోజనాల కోసం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించే వ్యక్తులకు మాత్రమే ఇది వర్తింపు.

కేవలం 15 రోజుల పాటు ఇరాన్‌లో పర్యటించే భారతీయులకు వారికి మాత్రమే ఈ కొత్త వెసులుబాటు వర్తిస్తుందని తెలిపింది.