TV9 Telugu

రూ 2.5 కోట్లు చెల్లించాడు..900 మంది ఖైదీలకు విముక్తి కల్పించాడు!

29 Febraury 2024

అరబ్‌ ఎమిరేట్స్‌లోని జైళ్లలో మగ్గిపోతున్న ఎందరో ఖైదీలకు ఓ భారతీయ వ్యాపారి కొత్త జీవితాన్ని అందించారు.

అందుకోసం ఆయన అక్కడి ప్రభుత్వానికి అక్షరాల రూ.2.25 కోట్లు చెల్లించారు. ఇదంతా ఆయన పరోపకారార్థం చేశారు.

ముస్లింల పవిత్ర మాసం రంజాన్‌కు ముందు ఎమిరేట్స్‌లోని భారతీయ వ్యాపారవేత్త 66 ఏళ్ల ఫిరోజ్‌ మర్చంట్‌ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.

గల్ఫ్‌ దేశంలోని వివిధ జైళ్లలో మగ్గిపోతున్న 900 మంది ఖైదీలను విడిపించాలనుకున్నారు. తన సొంత సొమ్ము రూ.2.25 కోట్లను అక్కడి ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు.

ఫిరోజ్‌ మర్చంట్‌ ప్యూర్‌ గోల్డ్‌ జ్యువెలర్స్‌ యజమాని. 2008లో ది ఫర్‌గాటెన్‌ సొసైటీ ఏర్పాటు చేశారు ఆయన.

యునైటెడ్‌ ఎమిరేట్స్‌ దేశంలోని జైళ్లలో మగ్గుతున్న 900 మంది భారతీయ ఖైదీలను ఫిరోజ్‌మర్చంట్‌ విడుదల చేయించారు.

ఖైదీలు తమ దేశాలకు వెళ్లటానికి అవసరమైన రవాణా చార్జీలు కూడా ఆయనే భరించారు. ఈ ఏడాది 3 వేల మంది ఖైదీలను విడిపించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారట

ప్యూర్‌ గోల్డ్‌ జ్యువెలర్స్‌ యజమాని దాతృత్వానికి ఎమిరేట్స్‌లోని సీనియర్‌ అధికారులంతా ఫిదా అవుతున్నారు.