అదృష్టం ఎవర్ని ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలీదు. ఆవగింజంత అదృష్టం ఉంటే చాలు రాత్రికి రాత్రి లక్షాధికారులను, కోటీశ్వరులను చేసేస్తుంది.
అదృష్టం లేకపోతే గడపదాకా వచ్చిన లక్ష్మి దేవి అటునుంచే వెనక్కి వెళ్లిపోతుంది. అమెరికాలోని ఓవ్యక్తి విషయంలో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది
అతను లాటరీలో వేలకోట్లు గెలుచుకున్నాడు. సదరు లాటరీ కంపెనీవాళ్లు పొరపాటున అతని నెంబరు పబ్లిష్ చేసామంటూ సొమ్మును ఇవ్వడానికి నిరాకరించింది.
జాన్స్ చీక్స్ అనే వ్యక్తి ఇటీవల ఓ లాటరీ గెలిచాడు. పవర్‌బాల్, డీసీ లాటరీ కంపెనీలో అతను 340 మిలియన్ల డాలర్ల లాటరీలో విజేతగా నిలిచాడు.
ఆ లాటరీ అమౌంట్ 2800 కోట్లు. జనవరి 6, 2023న జాన్ చీక్స్ ఆ లాటరీ టికెట్ కొన్నాడు. అయితే ఇప్పుడు ఆ లాటరీ విజేత న్యాయ పోరాటానికి దిగాడు.
టికెట్ డ్రా తీసిన రోజు.. డీసీ లాటరీ వెబ్‌సైట్‌లో జాన్ చీక్స్ లాటరీ నెంబర్ కనిపించింది. కానీ లాటరీ కంపెనీ మాత్రం ఆ వార్తను ఖండించింది.
నెంబర్ పొరపాటును పబ్లిష్ చేసినట్లు డీసీ లాటరీ కంపెనీ తెలిపింది. దీంతో అతను లీగల్ పోరాటానికి సిద్దమయ్యాడు. తనకు నష్టపరిహారం ఇవ్వాలని కేసు వేశాడు.
ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ అదృష్ట్రాన్ని పరిష్కరించుకోవడం కోసం లాటరీ తీసుకోవడం ఎప్పటినుంచో జరుగుతుంది.