గ్రీన్‌ కార్డు దరఖాస్తుదారులకు అమెరికా గుడ్‌న్యూస్

29 October 2023

అమెరికా దేశంలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీయులకు ఓ శుభవార్త తెలిపింది జో బైడెన్ సర్కార్.

గ్రీన్‌ కార్డు దరఖాస్తు ప్రాథమిక దశలోనే ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ కార్డు (ఈఏడీ) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ కార్డు అందజేయాలని అక్టోబరు 26న ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్స్‌ చేసిన వైట్‌హౌస్‌ కమిషనర్‌.

అవసరమైన ట్రావెల్‌ డాక్యుమెంట్లను ఆలస్యం చేయకుండా వెంటనే జారీ చేయాలని అమెరికా వైట్ హౌజ్ కమిషన్‌ సిఫార్సు చేశారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆమోద ముద్ర కోసం ఎదురుచూస్తున్న ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ కార్డు మంజూరు ప్రక్రియ.

అధ్యక్షుడు జో బైడెన్‌ ఆమోదిస్తే భారతీయులతో సహా లక్షలాది మంది విదేశీ వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూరనుంది.

తాజా వైట్ హౌజ్ సిఫార్సులు అమల్లోకి వస్తే అమెరికా ప్రభుత్వం ఐ-140 దశలోనే ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ కార్డు జారీ చేయాల్సిందే!

అమెరికా ప్రభుత్వం తాజా నిర్ణయంతో భారతీయులకు అందరికంటే ఎక్కువ మేలు కలిగిస్తుందంటున్నారు విదేశీ నిపుణులు.