మహానగరాన్ని వణికించిన పిల్లి!
TV9 Telugu
16 March 2024
ఓ పిల్లి కారణంగా జపాన్‌లో ఓ మహానగరం వణికిపోతోంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని జనం హడలి పోతున్నారు.
కారణం నగరంలో ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్‌లో పడి బయటికొచ్చి అక్కడి నుంచి కనిపించకుండా పోవడమే.
ఆ పిల్లి క్యాన్సర్ కారక రసాయనాన్ని అక్కడక్కడా వెదజల్లినట్లయితే తమ పరిస్థితి ఏంటని నగరవాసులు భయపడిపోతున్నారు.
జపాన్ దేశం హిరోషిమాలోని ఫుకుయామా నగర అధికారులు ఆ పిల్లిని వెదికేందుకు పెట్రోలింగ్‌ను మరింతగా పెంచారు.
ఆ పిల్లి ఎక్కడ కనిపించినా అప్రమత్తంగా ఉండాలని నగరంలో ప్రజలను హెచ్చరించారు ఫుకుయామా ప్రభుత్వ అధికారులు.
ఆ పిల్లి చివరిగా రసాయన కర్మాగారం నుండి బయటపడినట్లు సిసి ఫుటేజీలో కనిపించిందని వెల్లడించారు అక్కడి అధికారులు.
ఆ పిల్లికి అంటుకున్న రసాయనం అత్యంత ప్రమాదకరం. దానిని ముట్టుకున్నా లేదా పీల్చినా వెంటనే శరీరంపై దద్దుర్లు, వాపు వచ్చి, తీవ్ర వ్యాధికి దారితీస్తుంది.
ఆ పిల్లి ఇప్పటికే ఆ రసాయనాన్ని నాకి చనిపోయి ఉంటుందని స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన లిండా షెంక్ అనే నిపుణురాలు తెలిపారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి