ఆ ప్రాంతం పెద్ద సైజులో ఓజోన్ కు రంధ్రం..

24 November 2023

భూతలం నుంచి దాదాపు 35 కిలోమీర్ల ఎత్తులో ఓజోన్ పొర గొడుగులా సూర్యుడి నుంచి విడుదల అయ్యే అతినీలలోహిత కిరణాలను అడ్డుకుంటుంది.

ఈ ప్రాంతంలో భూతలం వాతావరణం కింది పొరలకన్నా ఎక్కువ వేడిగా ఉండటం వల్ల ఈ ఓజోన్‌ నేలకు చేరే అవకాశం ఉండదు.

వాయువు రూపంలో ఈ ఓజోన్ మన కంటికి అస్సలు కనపడదు. శాటిలైట్ల ద్వారా మాత్రమే ఓజోన్‌ ఉనికిని గుర్తించవచ్చు.

ఈ పొర లేకుంటే అతినీలలోహిత కిరణాలు భూమి మీద ఉన్న వృక్ష, జంతు, జీవరాశులన్నింటికీ హాని కలిగిస్తాయి.

అయితే భూమిపై క్లోరోఫ్లోరోకార్బ‌న్లు ఎక్కువ అవడం వ‌ల్ల ఆ ఓజోన్ పొర దెబ్బ‌తింటోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

19 ఏళ్ల క్రితం ఉన్న ప‌రిస్థితుల‌తో పోలిస్తే, ఇప్పుడు ఓజోన్ పొర మ‌రింత బ‌ల‌హీన‌ప‌డిన‌ట్లు రిపోర్టులో తెలిపారు.

అంటార్కిటికా ప్రాంతంలో రంధ్రం పెద్ద‌గానే ఉంద‌ని, చాలా లోతుగా రంద్రం ఏర్ప‌డిన‌ట్లు వాతావరణ పరిశోధకులు తెలిపారు.

నెల‌వారిగా, రోజు వారిగా ఓజోన్‌లో వ‌స్తున్న మార్పుల్ని స్ట‌డీ చేశారు. 2004 నుంచి 2022 వ‌ర‌కు వేర్వ‌రు రేఖాంశాలు, అక్షాంశాల్లో ఓజోన్ గుర్తించి అధ్య‌య‌నం చేశారు.