ఈ సముద్ర జీవి వెరీ వెరీ స్పెషల్ .. 9 మెదళ్లు, 3 హృదయాలు 

11 December 2023

ఆక్టోపస్‌ శరీరంలో అన్ని ప్రత్యేకాలే. ఆక్టోపస్ అంటే ఎనిమిది కాళ్లు వుండే జీవి. వెన్నెముక లేదు. వెన్నెముక లేని జీవులలో కెల్లా ఆక్టోపస్ చాలా తెలివైనది.

వెన్నెముక లేని జీవి

ఆక్టోపస్ శరీరం లోపల గానీ బయట గాని అస్తిపంజరం లేకపోవడం వల్ల చిన్న చిన్న ప్రదేశముల్లో కూడా చాలా సులువుగా దూరిపోతుంది.

అస్తిపంజరం

ఆక్టోపస్‌ల జీవిత కాలం చాల తక్కువే. వీటి మరణానికి వాటి పునరుత్పత్తే కారణం అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 

పునరుత్పత్తి

ఆక్టోపస్ ఎనిమిది చేతులలో మెదళ్లు సహా మొత్తం 9 మెదడులుంటాయి. శ్వాసను నియంత్రించడానికి మూడు హృదయాలను కలిగి ఉంటుంది.

మూడు హృదయాలు

ఆక్టోపస్ రక్తం కూడా నీలం రంగులో ఉంటుంది. అందుకే ఈ జీవి ఇతర జీవుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది.

 నీలం రంగు రక్తం

ఆక్టోపస్ తన శరీరంలో హీమోసైనిన్ అని పిలువబడే ఒక రాగి ఆధారిత ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది. దీని కారణంగా రక్తం నీలం రంగులోకి మారుతుంది

రాగి ఆధారిత ప్రోటీన్‌

ఆక్టోపస్‌ల నాడీ వ్యవస్థ కాస్త పెద్దగానే ఉంటుంది. సగటున ఒక్కో ఆక్టోపస్‌లో 50 కోట్ల నాడీ కణాలు లేదా మెదడు కణాలు ఉంటాయట.

పెద్ద నాడీ వ్యవస్థ

ఆక్టోపస్ సంబంధించిన జాతులు చాలా వరకు 6 నెలల్లో చనిపోతాయి. అంటే వీటి జీవితకాలం 6 నెలలు.

జీవితకాలం