ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం అంటే ఏంటి.?

04 November 2023

ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంతోమంది అభ్యర్ధులు నామినేషన్లు వేస్తుంటారు. అయితే ఫలితాలు వచ్చే నాటికి కొంతమందికి డిపాజిట్లు రాలేదని అంటారు. 

ఇంతకీ అసలు డిపాజిట్ కోల్పోవడం అంటే ఏంటి.? అసలు డిపాజిట్ కోల్పోకుండా ఉండాలంటే ఒక అభ్యర్ధికి ఎన్ని ఓట్లు ఉండాలి.?

సాధారణంగా ఎన్నికలకు నామినేషన్లు వేసే సమయంలో అభ్యర్ధులు కొంతమేరకు నగదు చెల్లించాల్సిన అవసరం ఉంది. 

ఎన్నికల సంఘం పోటీ చేసే అభ్యర్ధుల నుంచి షరతులతో కూడిన సెక్యూరిటీ డిపాజిట్‌ను తీసుకుంటుంది.

శాసనసభ ఎన్నికలకు రూ.10 వేలు ధరావతు కాగా,  ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం రూ.5 వేలుగా నిర్ణయించింది.

ఓ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్ధి.. సదరు నియోజకవర్గంలో పోలైన ఓటింగ్ శాతంలో ఆరో వంతు ఓట్లు సాధించాలి. 

అప్పుడే ఈ ధరావతుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. లేదంటే ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంటుంది. తద్వారా అభ్యర్ధి డిపాజిట్ గల్లంతవుతుంది.

ఈ డబ్బు ఎన్నికల ఫలితాల వచ్చినంతరం ధరావతు డబ్బులుగా తిరిగి వస్తే.. దాన్ని ఓటుగా లెక్కిస్తారు అధికారులు.

ఒకవేళ ఆ డబ్బు తిరిగి రాకపోతే సదరు అభ్యర్ధి డిపాజిట్లు కోల్పోయినట్టుగా భావిస్తారు ఎలక్షన్ అధికారులు.