01 November 2023
పొరుగు దేశం చైనా ఆహారం, పానీయాల విషయంలో చాలా అపఖ్యాతి పాలైంది. చైనీయులు టేబుల్, కుర్చీ మినహా ఏదైనా తింటారని ఒక సామెత
చైనీయులు ఎంతో ఇష్టంగా తినే గబ్బిలాలు, రక్కూన్ కుక్కల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు.
చైనాలోని వీధులు, సందులలో ఎవరూ ఊహించలేని అనేక రకాల ఆహారాలు రుచి చూడవచ్చు. కొన్ని రకాల ఆహారం పేరు వింటే చాలు వద్దు బాబోయ్ అంటారు.
తాజాగా చైనాకు చెందిన వీడియో అంటూ ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి మోమోలు తయారు చేసి ప్రజలకు అందిస్తున్నారు.
ఈ మోమోస్లో ప్రత్యేకత ఏమిటో చూస్తే బాబోయ్ అంటారు. దుకాణదారుడు మోమోలో పెట్టిన స్టఫింగ్ చూసి షాక్ తిన్నారు.
ఆ వ్యక్తి మోమోలో బతికి ఉన్న చిన్న చేపలతో నింపి క్లోజ్ చేస్తున్నాడు. అనంతరం దానిని స్టీమర్‌లో పెట్టి ఉడికిస్తున్నాడు.
ఇప్పుడు ఈ మోమోస్ ను చూసిన తర్వాత.. ఈ చైనీయులు కరోనా వంటి మరో మహమ్మారిని వ్యాప్తి చేయడానికి సిద్ధమవుతున్నట్లు అనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు.