సూర్యుడికి సంబంధించి సంచలన నిజాలు..!
02 September 2023
సౌర కుటుంభంలో సూర్యుడు హైడ్రోజన్, హీలియంతో కూడిన ఒక ప్రకాశవంతమైన నక్షత్రం. సూర్యుడు సౌర వ్యవస్థలో అతి పెద్ద నక్షత్రం.
సౌర వ్యవస్థలో మధ్యలో ఉండే సూర్యుడి వయస్సు దాదాపుగా 4.5 బిలియన్ సంవత్సరాలు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
భూమి నుంచి సూర్యుడికి దూరం దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. భూమితో పోలిస్తే పరిమాణంలో సూర్యుడు 1.3 మిలియన్ రెట్లు ఎక్కువ.
సూర్యుడి గ్రావిటీ గురించి చెప్పాలంటే.. సౌర వ్యవస్థ దాని కక్ష్యలో ఉండేందుకు సూర్యుడి గ్రావిటీయే కారణం.
స్పేస్ క్రాఫ్ట్ నుంచి విడిపోయిన పరికరాలు వాటి యొక్క కక్ష్యలో పరిభ్రమించడంలోనూ సూర్యుడి గ్రావిటీయే కీలకం.
సూర్యుడి కేంద్రంలో అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. అది దాదాపు 1 కోటి 50 లక్షల డిగ్రీల సెల్సియస్ అని అంచన.
సూర్యుడి శక్తివంతమైన కిరణాలు , ఉష్ణోగ్రత విశ్వమంతా వ్యాపించి, మొత్తం సౌరవ్యవస్థను ప్రభావితం చేస్తాయి.
సూర్య కిరణాలు 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమిని చేరేందుకు 8 నిమిషాల సమయం పడుతుంది.
హైడ్రోజన్, హీలియం వంటి వాయువులతో కూడి ఉండడంతో సూర్యుడిపై వేర్వేరు ప్రదేశాల్లో వేగం వేర్వేరుగా ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి