24 September 2023
వర్షాకాలంలో చెరువులు, కుంటలు నిండి ఇళ్లలోనికి నీరు వచ్చి చేరుతుంది. అపుడు ఇంట్లోకి పాములు చేరుకుంటాయి. కొన్ని సార్లు ఎలుకలను తినడానికి కూడా ఇంటిలోకి వస్తాయి.
గంధపు చెట్టు పాములకు సరైన విశ్రాంతి స్థలాన్ని అందిస్తుంది. ఈ చందనం చెట్లు తగినంత నీడను అందిస్తాయి. వీటి వాసన పాముకు అత్యంత ఇష్టం అని అందుకే పాములను ఈ చెట్లు ఆకర్షిస్తాయని అంటారు.
మల్లెపువ్వు, సంపెంగ, చమేలీ వంటి సువాసన గల మొక్కల దగ్గర పాములు ఎక్కువగా నివసిస్తాయి. ఈ మొక్కలు గుబురుగా పెరుగుతాయి. దీంతో వెట్టిలో తమని తామే కప్పుకుని పాములు నివసిస్తాయి.
కమలా ఫలాన్ని ఎలుకలు, చిన్న పక్షులు ఇష్టంగా తింటాయి. దీంతో ఈ చెట్టు చుట్టూ పాములు చేరుకుంటాయి. చిన్న కీటకాలు, పక్షులను ఆహారంగా తీసుకోవడానికి ఈ చెట్టుకిందకు చేరుకుంటాయి
క్లోవర్ మొక్కలు అందంగా దట్టంగా పెరుగుతాయి. వీటిని కూడా ఇంట్లో అలంకారం కోసం పెంచుతారు. భూమిని పూర్తిగా కప్పేసే మొక్కల ఆకుల కింద పాములు హాయిగా నివాసం ఏర్పాటు చేసుకుంటాయి.
సైప్రస్ మొక్క ఇంట్లో అలంకారం కోసం పెంచుతారు. దట్టంగా పెరిగి చాలా అందంగా కనిపిస్తుంది. దీంతో పాములు ఈ మొక్కలో దాక్కుని కీటకాలను ఆహారంగా తింటాయి.
ఎత్తైన వృక్షాల్లో దేవదారు వృక్షాలు ఒకటి. గంధపు చెట్ల మాదిరిగానే పాములు ఈ దేవదారు మొక్కలను చుట్టుకుని జీవిస్తాయి.