చిన్నారులను ఆస్పత్రిపాలు చేసిన దెయ్యం..

ఆన్‌లైన్ గేమ్‌లకు కొదవే లేదు. ఈ గేమ్స్‌కు పిల్లల సహా పెద్దలు సైతం బానిసలవుతున్నారు.

ఇలాంటి గేమ్స్ పిల్లలకు తీవ్ర హానీ కలిగిస్తున్నాయి.

పోకీమాన్, పబ్‌జీ తరువాత ఇప్పుడు మరో గేమ్ హడలెత్తిస్తోంది.

పోకీమాన్, పబ్‌జీ తరువాత ఇప్పుడు మరో గేమ్ హడలెత్తిస్తోంది.

దెయ్యం థీమ్‌తో రూపొందించిన ఈ గేమ్.. 36 మంది పిల్లలను ఆస్పత్రిపాల్జేసింది.

కొలంబియాలోని ఒక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ గేమ్‌లో పిల్లల్లో అకస్మాత్తుగా కంటి చూపు సమస్య తలెత్తింది.

వీరందరినీ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స అందించారు వైద్యులు.

పిల్లలందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, వారంతా కోలుకుంటున్నట్లు ఆదేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.