09 September 2023

కళ్లు చెదిరేలా మెరిసిపోతున్న ఎల్‌ఈడీ లైట్స్‌ లెహంగా..

కళ్లు చెదిరేలా మెఎల్‌ఈడీ లైట్స్‌ లెహంగాలో  వధువు  కళ్లు చెదిరేలా మెరిసిపోయి అందరినీ ఆకట్టుకుంది. పాకిస్తాన్‌లో ఓ పెళ్లి వేడుకలో ఎల్‌ఈడీ లెహంగా సృష్టించిన బజ్ మామూలుగా లేదు. రిసిపోతున్న ఎల్‌ఈడీ లైట్స్‌ లెహంగా..

జీవితంలో ఒక్కసారి వచ్చే పెళ్లి ఎంతో ఘనంగా జరుపుకోవాలని అందరిలాగా  వరుడు కోరుకున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను నెలల ముందు నుంచే మొదలు పెట్టేసాడట.

పెళ్లి రోజున వధువు  ఎంతో అందంగా, బ్రైట్‌గా కనిపించాలని అనుకున్నాడు.  అందుకోసం దుస్తుల దగ్గర నుంచి, అలంకరణ వరకూ అన్నీ ప్రత్యేకంగా ఉండాలని ఆలోచించాడు.

పెళ్లి వేడుకలో తనకు కాబోయే భార్య డ్రెస్‌ను ఇప్పటి వరకూ ఎవరూ ధరించని, ఊహించని విధంగా డిజైన్‌ చేయించాడు. లెహంగాను చిన్న ఎల్‌ఈడీ లైట్లతో  ఫాబ్రిక్‌పై కుట్టి అలంకరించారు

మెహందీ వేడుకలో ఎల్‌ఈడీ లైట్స్‌ లెహంగా  ధరించిన వధువు అందరి కళ్లు తన వైపు తిప్పుకుంది..వధువు, ఆమె భర్త వేడుకలోకి వెళ్లినప్పుడు, లైట్లు మెరిసి ఆమెను చక్కని చుక్కలా మార్చాయి.

పెళ్లిళ్లు చేసుకోబోయే వధువులు వారి వెడ్డింగ్ డ్రెస్సుల విషయంలోనూ క్రియేటివ్ గా ఆలోచించేలా వీడియో  ప్రేరేపించింది. ఆత్మవిశ్వాసంతో అందంగా కనిపించే దుస్తులు ధరించడమే ఫ్యాషన్ అని గుర్తు చేసింది.

తన వీడియో వైరల్ కావడంపై  వధువు  రెహాబ్ డానియల్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. తన కోసం డిజైనర్‌గా మారిన భర్తను చూసి మురిసిపోతోంది.