హిస్టరీ క్రియేట్ చేయనున్న వందే భారత్..
16 August 2023
మారుతున్న కాలంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటుంది భారతీయ రైల్వే. ప్రయాణికులు ఆహా అనేలా రైళ్లను తయారుచేస్తోంది.
ఇందులో భాగంగానే దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించింది.
.మొత్తం 25 మార్గాల్లో 50 సర్వీసులందిస్తున్నా వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది.
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలైన అయోధ్య, వారణాసి, ప్రయాగ్ రాజ్ ప్రాంతాలను కలుపుతూ వందే భారత్ ను నడపాలని నార్తర్న్ రైల్వే డివిజన్ యోచిస్తోంది.
దీని కారణంగా పర్యాటక రంగం మరింత ఆహ్లదకరంగా మారటమే కాక అభివృద్ధి చెందుతుంది అంటున్నారు భారతీయ రైల్వే అధికారులు.
లక్నో నుంచి అయోధ్య, ప్రయాగ్‌రాజ్, వారణాసి ప్రాంతాలను కలుపుతూ వందే భారత్ ను నడపాలని ఓ ప్రతిపాదన రైల్వే బోర్డుకు నార్తర్న్ రైల్వే అధికారులు పంపించారు.
మూడు ఆధ్యాత్మిక క్షేత్రాలను కలుపుతూ అందుబాటులోకి రానున్న తొలిరైలుగా వందే భారత్ చరిత్ర సృష్టించనుంది.
ఈ రైలు ఉదయం 6.00 గంటలకు లక్నోలో మొదలై అయోధ్య, ప్రయాగ్ రాజ్ మీదగా 430 కి. మీ. దూరాన్ని ఐదున్నర గంటల్లో ముగించి వారణాసికి చేరుకుంటుంది.
ఇది సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా పలు డివిజన్లలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను కలుపుతూ మరిన్ని వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి