అయ్యప్ప స్వాములకు ఆర్టీసీ బంపరాఫర్‌.. సూపర్‌ లగ్జరీ బస్సులు

06 October 2023

మణికంఠ స్వాములు మాల విరమణ కోసం శబరి వెళ్తుంటారనే విషయం తెలిసిందే. డిసెంబర్‌ నెల నుంచి భక్తులు శబరి పయణమవుతుంటారు.

ఇలాంటి వారి కోసమే తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. శబరి వెళ్లే భక్తులకు కోసం తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్‌ ప్రకటించింది. 

అద్దె ప్రాతిపదికన సూపర్‌ లగ్జరీ బస్సులు సమకూర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. 

ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంట మనుషులు, సామాన్లు సర్దేందుకు ఓ వ్యక్తికి, బస్సు బుక్ చేసిన గురుస్వామి ఉచితంగా ప్రయాణించవచ్చు. 

ఇందులో భాగంగా సుశిక్షితులైన డ్రైవర్లతో, భద్రమైన ప్రయాణాన్ని అయ్యప్ప భక్తులకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. 

ఈ బస్సుల్లో టీవీ సౌకర్యం ఉంటుందని, బెండ్ అయ్యే సీట్ల సౌకర్యంతో దూర ప్రయాణం సౌకర్యవంతంగా ప్రయాణించవ్చని అధికారులు తెలిపారు. 

ఇక బస్సును అద్దెకు బెక్ చేసిన గురుస్వామికి ఉచితం ప్రయాణం కల్పిస్తున్నారు ఆర్టీసీ అధికారులు.

ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్‌ చేసిన గురుస్వామికి బస్సులపై రోజుకు రూ. 300 చొప్పున కమిషన్‌ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.