30 November 2023

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..!

ఈ ఏడాది అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్‌, జ్యూరిచ్‌ నిలిచాయని ‘ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌’ ప్రకటించింది. 

జూరిచ్‌ ఆరో స్థానం నుంచి ఎగబాకి సింగపూర్‌ సరసన చేరింది. గత ఏడాది సింగపూర్‌తో పాటు తొలిస్థానంలో నిలిచిన న్యూయార్క్‌ ఈసారి మూడోస్థానానికి దిగజారింది.

నిత్యావసర సరకులు, గృహోపకరణాలు, కొన్ని రకాల సేవల ధరలు పెరిగిన నేపథ్యంలోనే జ్యూరిచ్‌ మళ్లీ ఈ ఏడాది కూడా ఖరీదైన నగరంగా మారింది. 

అత్యంత ఖరీదైన తొలి పది నగరాల జాబితాలో ఆసియా నుంచి సింగపూర్‌, హాంకాంగ్‌ ఎంపికయ్యాయి

జాబితాలో అమెరికాకు చెందిన మూడు నగరాలున్నాయి. అవి  న్యూయార్క్‌, లాస్‌ఏంజెలస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో. అలాగే ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ కూడా సెలెక్ట్‌ అయింది. 

పశ్చిమ యూరోప్‌ నగరాల్లో నిత్యావసరాలు, దుస్తుల ధరలు పెరిగాయి. అలాగే కరెన్సీ విలువలు సైతం పెరగడంతో ఈ ప్రాంతం నుంచి నాలుగు నగరాలు జాబితాలో చేరాయి.

రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌ స్థానాలు జాబితాలో భారీగా కిందకు దిగజారాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 173 నగరాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు ఈఐయూ తెలిపింది.