03 November 2023
థాయ్‌లాండ్ వెళ్లాలనుకుంటున్నారా..? అయితే, మీకో గుడ్‌న్యూస్..!
థాయ్‌లాండ్ వెళ్లేందుకు ఇకపై వీసా అక్కర్లేదు. భారత్‌తో పాటు తైవాన్ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా నుంచి మినహాయింపు ఇచ్చింది థాయ్ ప్రభుత్వం
వీసా మినహాయింపు 2023 నవంబర్ నుంచి మే 2024 వరకు కొనసాగుతుంది
భారత్, తైవాన్ నుంచి వచ్చే వ్యక్తులు 30 రోజుల పాటు వీసా లేకుండా థాయ్‌లాండ్‌లో పర్యటించవచ్చు
భారత్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లే వారు రెండు రోజుల థాయ్ వీసా కోసం 2 వేల థాయ్ బాట్స్ అంటే 57 డాలర్లు చెల్లించేవారు
అక్కడి ప్రభుత్వం విదేశీ పర్యాటకుల నుంచి వచ్చే ఆదాయాన్ని 3.3 ట్రిలియన్ బాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో టూరిజానికి స్వల్పకాలిక ఆర్థిక ఉద్దీపనలను అమలు చేస్తుంది.
బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ డేటా ప్రకారం.. పర్యాటక రంగం ఆ దేశ జీడీపీలో 12 శాతం ఉండగా ఉద్యోగాలలో ఐదో వంతుకు సహాయపడుతోంది
ఇక్కడ క్లిక్ చెయ్యండి