31 October 2023
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం తపాల నరసింహ స్వామి ఆలయంలో గత 15 ఏళ్లుగా ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. అందుకే ఈ దేవాలయం ప్రేమికుల నిలయంగా మారింది.
ఈ ఆలయంలో ప్రతి నెల 25 నుంచి 30 ప్రేమ వివాహాలు జరుగుతాయి. కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రేమికులు ఈ ఆలయంలో పెళ్లిళ్లు చేసుకుంటారు.
ఒకప్పుడు ఈ ఆలయంలో ప్రేమ వివాహానికి రూ.500 ఖర్చయ్యేది. అందులో రూ.200 ఆలయ రుసుము. ఇప్పుడు ఈ ఖర్చు రూ.5 వేలకు పెరిగింది.
ఈ ఆలయంలో ఇప్పటి వరకు 4000 ప్రేమ వివాహాలు జరిగాయి. నరసింహస్వామి తమ కోరికలు తీరుస్తాడని ప్రేమికుల నమ్మకం.
1989లో ఈ ఆలయంలో నరసింహ స్వామి స్వయంభువుగా వెలిశాడని విశ్వాసం. ఈ ఆలయంలో చట్టబద్ధమైన ప్రేమ పెళ్లిళ్లు మాత్రమే జరుగుతాయి.
18 ఏళ్లు నిండిన యువతీయువకులు చట్టబద్ధంగా వివాహం చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న జంటలకు వివాహ ధృవీకరణ పత్రాలు కూడా అందిస్తారు.
ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున ఈ ఆలయంలో వివాహాలు చేసుకునేందుకు ప్రేమికులు ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయంగా ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశం.